Magazines

నవంబర్‌లోనూ ఎండల తీవ్రత

53 నిమిషాల క్రితం

Intense heat
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం

అధిక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

దేశంలో వర్షపాతం లోటు తప్పదంటున్న ఐఎండీ

దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటులో 77 శాతమే వర్షాలు

బలపడుతున్న ఎల్‌నినో ప్రభావం

.

న్యూఢిల్లీ : దేశంలో నవంబర్‌ నెలలోనూ ఎండల తీవ్రత కొనసాగనుంది. సాధారణంగా ఈ సమయంలో చలి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. బలమైన ఎల్‌నినో పరిస్థితులు వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఐఎండీ అక్టోబర్‌ 31న విడుదల చేసిన నవంబర్‌ నెలవారీ వాతావరణ అంచనాల ప్రకారం..

హిమా లయ పర్వత ప్రాంతాల దిగువన ఉన్న కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండను న్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాల దిగువన మాత్రం సాధారణ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణో గ్రతల విషయానికి వస్తే.. మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలు మినహా మిగిలిన దేశంలో సాధారణం కంటే ఎక్కువగా నమో దయ్యే సూచనలు ఉన్నాయి. మధ్య, తూర్పు ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

వర్షాలు తక్కువే..

నవంబర్‌లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. మధ్య భారతదేశం, వాయవ్య భారత దేశం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ స్థాయి లో లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దేశవ్యాప్తంగా నవంబర్‌లో దీర్ఘకాల సగటు వర్షపాతంలో (ఎల్‌పీఏ) 77 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 1971-2020 మధ్య నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే నవంబర్‌లో దేశవ్యాప్త సగటు వర్షపాతం 29.7 మిల్లీమీటర్లుగా ఉంది.

దక్షిణ భారతంలోనూ ఇదే పరిస్థితి..

దక్షిణ భారతదేశంలోనూ నవంబర్‌ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 118.7 మిల్లీమీటర్లు కాగా, ఈసారి అందులో 77 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఎల్‌నినోతో మారనున్న వాతావరణం..

ప్రస్తుతం భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో అత్యంత బలమైన ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐఎండీ పేర్కొంది. మాన్‌సూన్‌ మిషన్‌ కపుల్డ్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంసీఎఫ్‌ఎస్‌)తో పాటు ఇతర అంతర్జాతీయ వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం నవం బర్‌-డిసెంబర్‌ నెలల్లోనూ ఈ పరిస్థితులు కొనసాగనున్నాయి. అత్యంత బలమై న ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో సాధా రణ నమూనాలు మారిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు ఏర్పడే ప్రమా దం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వేడి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్