నాగార్జున అక్కినేని కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ ప్రాజెక్ట్ ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో పాత్రను పరిచయం చేయడంతో అంచనాలు పెంచుతోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి అశోక్ సెల్వన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కర్ణగా ఆయనలోని వైల్డ్‌నెస్‌ను ప్రజెంట్ చేస్తూ ఈ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. పూర్తి ఇంటెన్స్ అవతార్‌లో అశోక్ సెల్వన్ అదిరిపోయారు.
ఈ ఫస్ట్ లుక్‌తో కర్ణ పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఆయన పాత్ర ఎలాంటి ప్రభావం చూపించనుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. నాగార్జున, టబు, అశోక్ సెల్వన్ వంటి వెర్సటైల్ స్టార్స్ భాగమైన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రాజా మహదేవన్, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: సతీష్ కుమార్ ఎన్.







కామెంట్‌లు (0)