Magazines

‘బతుకమ్మ..’ ఓ పండగలాంటి పాట

24 నిమిషాల క్రితం

Bathukamma
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్‌టీ రిపీట్‌’ ఈనెల 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. మేకర్స్ తాజాగా ‘బతుకమ్మ..’ పాటను లాంచ్ చేశారు. వివేక్ సాగర్ అద్భుతంగా స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రేయా ఘోషల్ వోకల్స్ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ,‘నాకు మణిరత్నం ‘సఖి’ సినిమాలోని ‘ఏడే ఏడేడే’ పాట చాలా ఇష్టం.

నా సినిమాల్లో కూడా అలాంటి ఒక పాట ఎప్పుడైనా చేయాలనుకునేవాడిని. ఫైనల్‌గా ఈ బడ్డీ కామెడీ సినిమాలో అలాంటి సిచువేషన్ కుదిరింది. ఇందులో ఒక ఫ్యామిలీ మీకు కొత్తగా కనిపిస్తుంది. ఆ కథకు ఈ ఫ్యామిలీకి ఏం సంబంధం అనేది మొదటి 15 నిమిషాల్లోనే అర్థమైపోతుంది. సాంగ్ డ్యాన్స్ చేయడం అనేది నాకు కూడా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. వివేక్ సాగర్ అద్భుతమైన పాట ఇచ్చారు. చంద్రబోస్ మాకు ఎంతో గైడ్ చేశారు. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే ఈశ్వర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. శివాత్మికను ఇందులో కీర్తన అనే పాత్రలో పరిచయం చేస్తున్నాం. కచ్చితంగా ప్రేక్షకులందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఫెస్టివల్ సాంగ్. ఈ సినిమాలో ఈ పాట ఎందుకు ఉందనేది ఈనెల 19న చూస్తారు’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్