హీరో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవు తున్నారు. ఈ సినిమా కోసం ఆయన నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా సహ నిర్మాత.
క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 25 విడుదల కానుంది. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ ‘రుత్తూ’ ను విడుదల చేశారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,‘కుటుంబం అంతా కలిసి ఇలాంటి ఒక సినిమా చూస్తే బాగుంటుందనిపించి ఈ కథ రాశాను. ‘భజగోవిందం’ పాట కూడా అందరికీ నచ్చింది. ‘రుత్తూ’ పాట కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. భీమ్స్ ప్రతి పాటను అద్భుతంగా చేశారు.
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఔట్పుట్ పరంగా, బిజినెస్ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం’ అని తెలిపారు. ‘ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్నాము. సినిమా చేయాలని అనుకున్నప్పుడు మంచి కుటుంబ విలువలతో కూడిన కథ చేయాలని భావించాం. కిరణ్ చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. ప్రతి డైలాగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కిరణ్ చాలా అద్భుతంగా రాశారు. ‘భజగోవిందం’ పాట ప్రతి ఇంటికీ చేరువైంది. చాలామంది తమ స్టేటస్‌లో కూడా పెట్టుకుని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా విలువ ఉన్న కథ ఇది. ఆ కథకు తగ్గట్టుగానే ఆ పాటను చేశాం. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా మంచి పాటలు ఉన్నాయి. మంచి మంచి కమర్షి యల్ సాంగ్స్ ఉన్నాయి. ఆల్బమ్ చాలా అద్భుతం గా ఉండబోతుంది’ అని ప్రొడ్యూసర్ సుధాకర్ చాగంటి చెప్పారు.
హీరోయిన్ దేవికా మాట్లాడుతూ,‘ఇది నా తొలి సినిమా. నాకు చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి మంచి సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
ఈ సినిమా కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఇప్పటికే మీరు ‘భజ గోవిందం’ పాట చూశారు. సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఉంటుంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది మనందరం రిలేట్ చేసుకునే కథ. ఇలాంటి కథను అందరూ రాయలేరు. ఇలాంటి అద్భుతమైన కథను తీసు కొస్తున్న కిరణ్‌కి ధన్య వాదాలు’ అని డీవోపీ విశ్వాస్ డానియల్ చెప్పారు. లిరిక్ రైట పూర్ణాచారి మాట్లాడుతూ,‘సనారే రాసిన ‘భజగోవిందం’ పాట చాలా పెద్ద హిట్ అయింది. రెండో పాట రాసే బాధ్యతను నాకు కిరణ్ అబ్బ వరం ఇచ్చారు. ప్రేమలో ఒక మ్యాజిక్‌ను క్రియేట్ చేసేలా ఈ పాటను రాశాను. ఈ పాట మీ అందరికీ నచ్చటం చాలా చాలా ఆనందంగా ఉంది. ‘రియాలిటీ’ మన ఇంటి కథ, మనందరి కథ’ అని తెలిపారు. ‘ఇందులో ‘భజగోవిందం’ పాట రాశాను. ఆ పాట అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇదొక హై మూమెంట్. ఈ పాట నాకు ఒక విజిటింగ్ కార్డులా మారింది’ అని లిరిక్ రైటర్ సనారే అన్నారు.
ఇది మనందరి కథ
15 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్లు (0)