Magazines

‘రంగస్థలం’కి మించి..

3 గంటల క్రితం

Rangasthalam
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

‘రంగస్థలం’ వంటి సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ తరువాత కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా హైదరాబాద్‌లో ఆదివారం సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా ముహూర్తంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. దిల్ రాజుతో కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేడుకకు హాజరైన దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, సుకుమార్ విజయ వంతమైన కలయికలో మరో కొత్త అధ్యాయానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలికింది.


గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ తెలుగు సినిమాలో ఓ మైలురాయిగా నిలిచింది. కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు, సాంకేతిక నైపుణ్యంతో ఆ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరూ చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్చరణ్ పూర్తిగా కొత్తగా మారబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్‌ మెంట్ పోస్టర్‌లో నీలం, ఆకుపచ్చ, బం గారు రంగుల కలయికతో రూపొం దించిన అద్భుతమైన నెమలి ఈక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆర్ట్ వర్క్ లో రామ్ చరణ్ ముఖాన్ని అందంగా మిళితం చేశారు. మేకర్స్ విడుదల చేసిన ‘యు కెన్ ఇమాజిన్’ అనే క్యాప్షన్ ఈ కలయికపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను తెలియజేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్