‘‘రామాయణ’లో రావణుడిగా నటిస్తున్నానని చెప్పినప్పుడు తన కుమారుడి రియాక్షన్‌ను కథానాయకుడు యశ్ గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు విలన్ పాత్ర ఎందుకు చేస్తున్నావ్?, ‘అలా ఎలా చేస్తావ్?’ అంటూ తన కొడుకు అడిగిన ప్రశ్నలకు తాను చెప్పిన సమాధానాలను ఆయన మీడియాతో తెలిపారు.
యశ్ ‘రామాయణ’లో రావణుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక రెండు భాగాల ఇతిహాస చిత్రానికి మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని యశ్ పంచుకున్నారు. తాను రాముడి పాత్రలో కాకుండా రావణుడి పాత్రలో ఎందుకు నటిస్తున్నానో తన చిన్న కొడుకుకు వివరించాల్సి వచ్చిందని చెప్పారు.
ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ యశ్ మాట్లాడుతూ.. “నా కొడుకుకు తన తండ్రి ఎవరో తెలుసు. కానీ ఇప్పుడు రామాయణ కథ గురించి తెలుసుకున్నాక ఆశ్చర్యపోయాడు. ఈ కథలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రధాన వ్యక్తి శ్రీరాముడు. ప్రతి ఒక్కరూ రాముడి మార్గంలో నడవాలి. రావణుడు గొప్పగా, శక్తిమంతంగా, గంభీరంగా కనిపించవచ్చు. కానీ జీవితంలో నిజమైన, శాశ్వతమైన విజయం రావాలంటే రాముడి ధర్మాన్ని మనం ఆచరించాలి. థియేటర్‌లో నటుడిగా నువ్వు నన్ను చూసి చప్పట్లు కొట్టవచ్చు. కానీ నేను పోషిస్తున్న పాత్రనే ఆదర్శంగా భావించకూడదు’ అని చెప్పాను’ అని యశ్ వెల్లడించారు.ఈ సినిమా ఈనెల 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆ పాత్రనే ఆదర్శంగా భావించొద్దు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)