Magazines

అందమైన ప్రేమ కథ

42 నిమిషాల క్రితం

beautiful love story
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌‌ను విడుదల చేసింది. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ముందుకు వెళ్తున్న కొద్దీ స్నేహం, ప్రేమ అనే ఎమోషన్స్‌ని చూపించారు. ఇక కాలేజ్ లైఫ్, జాబ్ లైఫ్‌లో ఉన్న లవ్ స్టోరీతో కథలోని సంఘర్షణను అందంగా తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ డైలాగ్‌తో ‘హైకూ’ కథ సారాంశాన్ని చెప్పేశారు. ‘ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతోందని ఈ ట్రైలర్ చెబుతోంది. మ్యూజిక్ ఎంతో సూథింగ్‌గా ఉండగా.. విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కి నచ్చే అందమైన ప్రేమ కథా చిత్రంగా ఇది ఈనెల 23న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇది మీ హృదయాలను హత్తుకునే ప్రేమకథ అవుతుందనే నమ్మకం ఉంది’అని మేకర్స్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్