ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఆమె పేరుతోనే ఓ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి ఈ వేడుకకు హాజరయ్యారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ,‘గరివిడి లక్ష్మి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు. డైరెక్టర్ చాలా నిజాయితీగా ఈ కథను చెప్పారు. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలో కలిసిపోయాను’ అని అన్నారు. ‘‘మహానటి’లో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ కి ఎంత పేరు వచ్చిందో, అలాగే ఆనందికి కూడా గరివిడి లక్ష్మి అంత మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అని డైరెక్టర్ బాబీ చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ‘ఇలాంటి పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఎంతో బలంగా నమ్మి తీస్తే ఎంత నిజాయితీగా వస్తుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాను విశ్వ చాలా ప్యాషనేట్‌గా చేశారు. ఇలాంటి ఒక మంచి కథను ప్రపంచానికి చెప్పాలనుకోవడం నిజంగా హ్యాట్సాఫ్. కృతి చాలా చిన్న వయసులో చాలా పెద్ద గౌరవం వచ్చే సినిమా చేస్తుంది. ఇది అందరికీ గౌరవం తెచ్చే సినిమా అవుతుంది. గౌరీ నాయుడు చాలా అద్భుతంగా తీశాడు. ఆనంది అద్భుతమైన నటి. ట్రైలర్‌లో తన పెర్ఫార్మెన్స్ టచ్ చేసింది’ అని హరీష్ శంకర్ చెప్పారు.






కామెంట్‌లు (0)