Magazines

ఈ తరానికి చెప్పాల్సిన కథ

1 గంట క్రితం

generation
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్లో సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్ష‍కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్ లాంచ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. హీరో, డైరెక్టర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ, ‘ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూపొందించాం. గొప్ప సినిమాలను ప్రజలు తండోప తండాలుగా థియేటర్స్ కు వెళ్లి చూస్తుంటారు. మా సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందని నమ్ముతున్నాం. డబ్బుల కోసం ఈ సినిమాని రూపొందించలేదు. రామానుజాచార్యుల వారి గొప్ప కథను ఈ తరం వారికి చూపించాలని ప్రయత్నించాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.

అందుకు మా నాన్నకి థ్యాంక్స్. ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు వహిస్తూనే, కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. రామానుజాచార్యుల వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నమ్మి ఈ సినిమాను నిర్మించాం’ అని నటి, ప్రొడ్యూసర్ ప్రవళ్లిక అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ,‘ఈ సినిమా గురించి సాయి వెంకట్ చెప్పినప్పుడు చాలా కష్టంతో కూడు కున్న సినిమా కదా అన్నాను. ఆయన మేము ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆయన చాలా కన్విక్షన్ తో రూపొందించారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. అయినా మనమంతా కలిసే ఉంటున్నాం. ఈ భావనకు మొదట కృషి చేసింది రామానుజాచార్యుల వారు. మనమంతా ఒక్కటే అని ఆయన చెప్పిన గొప్ప మాటలు మనల్ని ఇప్పటికీ ఐక్యంగా నడిపిస్తున్నాయి. ఈ సినిమాని మీ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా చూడండి’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్