Magazines

కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్‌

03 సెప్టెంబర్, 2026

ear-jerking
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 2 నిమిషాల చదవడం

చలంశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్ మీద సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం ‘అల్ల కల్లోలం’ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,‘టీజర్ ఇంప్రెసివ్‌గా అనిపించింది. నాకు సతీష్‌తో ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా ఈ సినిమాని వదల్లేదు. కష్టపడి ఈ స్థాయికి తీసుకు వచ్చాడు. రామ్ మిర్యాల వాయిస్ అంటే నాకు ఇష్టం. మా సతీష్ కి సపోర్ట్ చేస్తున్న మైత్రి శరణ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా కమర్షియల్ అంశాలతో పాటు సెల్యూట్ కొట్టేలా మంచి మెసెజ్, ఎమోషన్ కూడా ఉంటుంది. మీ (మీడియా)లోని ఒకరి స్టోరీలానే ఈ సినిమా ఉంటుంది. క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు.

నా భార్య మైత్రి శరణ్ నాకంటే చాలా ఫేమస్. ఆమె నాకు స్పూర్తి. సెవెన్ హిల్స్ సతీష్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు’ అని హీరో, నిర్మాత, దర్శకుడు సతీష్ జై చెప్పారు. సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ, ‘మూవీ అద్బుతంగా వచ్చింది. ‘అల్లకల్లోలంగా’ ట్యూన్ అద్భుతంగా కుదిరింది’ అని తెలిపారు. ‘టీజర్ అందరికీ నచ్చింది. అంతటి ఆదరణ లభిస్తుందని మేం కూడా ఊహించలేదు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది ఆడియెన్స్ చూడటం లేదు. మాకోసం ఈ రోజు సాయి రాజేష్ రావడం, సాంగ్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మతో పని చేయడం మా కల. ఆయన ఇచ్చిన బీజీఎం, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మిట్టపల్లి మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. మా సినిమాని థియేటర్లో చూసి విజయాన్ని అందించాలని కోరు కుంటున్నాను’ అని నిర్మాత మైత్రి శరణ్ అన్నారు. ఫర్నాజ్ శెట్టి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో భాగం అవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్