హీరో శర్వా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్స్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హీరో, అతని ప్రేమకథకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడమే కాకుండా.. ఒక రా, ఇంటెన్స్, రూటెడ్, ర్యాజింగ్ ప్రపంచానికి టీజర్ ప్రజెంట్ చేసింది. 1960ల ప్రారంభంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గంగగా శర్వాతోపాటు అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి పాత్రల తీరుని టీజర్‌లో చూపించారు.







కామెంట్‌లు (0)