విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వ వహించారు. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ,‘సోమవారమే కాదు.. ఈ రోజు (మంగళవారం) కూడా మంచి ఫ్లోటింగ్ ఉంది. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. సినిమాకు అన్ని వైపుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫామెన్స్ పరంగా ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది’ అని అన్నారు. ‘ఈ సినిమా సక్సెస్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విక్రమ్ నా కొడుకు అవ్వడం, అతని మీద ఒక సినిమా తీయడానికి త్రినాథ్ రావు, నాయుడు ముందుకు రావడం గొప్ప విషయం. ‘ఎవడి గోలవాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ అదే థియేటర్లో చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధించి, దసరా ధమాకాగా నిలు స్తుంది. సోమవారం నైట్ షోలు కూడా ఫుల్స్ అయ్యాయి’ అని లగడపాటి శ్రీధర్ చెప్పారు. కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ, ‘రెండు వందల థియేటర్లలో మా మూవీని రిలీజ్ చేశాం. ఇంత మంచి ఆదరణ లభిస్తున్న ఈ సినిమాకి కాకుండా ఇతర భాషల చిత్రాలకు థియేటర్లను ఇస్తున్నారు. మా సినిమాకి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మేం మంచి మూవీని తీశాం. మా చిత్రానికి ఇంకా థియేటర్లు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నాను’ అని తెలిపారు.






కామెంట్‌లు (0)