Magazines

దశావతరాల గుడి నేపథ్యంలో..

49 నిమిషాల క్రితం

Dashavatara temple.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘హైందవ’. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మేకర్స్ బుధవారం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ,‘ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఇది చాలా అద్భుతమైన కథ. డైరెక్టర్ లుదీర్ కథ చెప్పగానే మాకు చాలా నచ్చింది. మహేష్ నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎవరో కాదు, సీనియర్‌ దర్శకులు కోడి రామకృష్ణ అల్లుడు. ఇప్పుడున్న సమయంలో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు చాలా ఇంపార్టెంట్. శ్యాంప్రసాద్ రెడ్డిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా అద్భుతమైన సినిమా తీశాం. ఇది మీకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నవంబర్‌ 27న తప్పకుండా మీరందరూ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘డైరెక్టర్ లుదీర్ గారు చాలా మంచి నెరేటర్. ఆయన కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని హీరోయిన్ సంయుక్త చెప్పారు. ప్రొడ్యూసర్ మహేష్ చందు మాట్లాడుతూ, ‘సాయి ఈ కథను చాలా ఎగ్జైట్ అయ్యారు. టీజర్ ఎంతగా ఆకట్టుకుందో, సినిమా అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘టీజర్‌లాగే సినిమా కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ ఇది. నడవలేని విగ్రహాలు కథను నడిపిస్తాయి. విగ్రహాలకు, ఒక పోలీస్ ఆఫీసర్‌కు మధ్య ఎలాంటి కథ జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్