Magazines

ప్రేక్ష‍కుల ఆదరణ అద్భుతంగా ఉంది

47 నిమిషాల క్రితం

audience's response
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వంలో చావన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. ఈనెల 9 నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హర్ష మాట్లాడుతూ, ‘ప్రేక్ష‍కుల ఆదరణ అద్భుతంగా ఉంది. దీనికి సీజన్ 2 కూడా ఉంటుంది. రీల్స్‌లో మా కంటెంట్ వైరల్ అవుతోంది. ఈ సిరీస్ చూసి చాలా మంది కాల్ చేశారు. చాలామంది ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. నాలో వారిని చూసుకున్నానని చెప్పారు. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఆలోచింపజేస్తుంది. అలాగే వాల్యూస్, ఇన్‌సెక్యూరిటీస్ గురించి చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. ఇంత మంచి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘నాలుగు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ రీచ్ కావడం, అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టిన రెండు రోజుల్లోనే నెంబర్‌ వన్ పొజిషన్‌లోకి రావడం చాలా గొప్ప విషయం. అది ఇంకా కంటిన్యూ అవుతోంది.ఇది సూపర్ హిట్ మాత్రమే కాదు, పెద్ద బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్. చాలామంది చూసి చాలా బాగుందని కాల్ చేశారు’ అని వంశీ నందిపాటి చెప్పారు. డైరెక్టర్ బాబు మాట్లాడుతూ, ‘ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మీమర్స్, అన్ని హ్యాండిల్స్‌లో ఈ సిరీస్ వైరల్ అవుతోంది. బాగుందని చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్