Magazines

చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి

1 గంట క్రితం

surprises
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

హై జాయ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, విఐపి - వింటేజ్‌ ఐకానిక్‌ పిక్చర్స్‌ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న సినిమా ‘చకోర’ - లూనర్‌ లవ్‌ బర్డ్‌. మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ప్రేమ జంటగా పరిచయం అవుతున్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 9న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డైరెక్టర్ శివ నిర్వాణ అతిథిగా విశాఖలో ఘనంగా నిర్వహించారు. నిర్మాత డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ, ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఇదొక భిన్నమైన ప్రేమ కథ. ఈ సినిమా చూసి మీరు అందించే ప్రశంసలు, కొట్టే చప్పట్లే మాకు కోట్లాది రూపాయల ఆస్తిగా భావిస్తాం’ అని తెలిపారు. హీరో శ్రవణ్ మాట్లాడుతూ,‘ఈ సినిమాలో స్నేహితుల మధ్య బంధాన్ని, తల్లి కొడుకు మధ్య బంధాన్ని, ప్రేమ జంటలోని అనుబంధాన్ని చూస్తారు. సినిమాలో ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’ అని తెలిపారు. ‘చకోర ఒక విశిష్టమైన పక్షి. దాహం వేస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకుండా వర్షపు నీళ్లతోనే దాహం తీర్చుకుంటుంది. మనం కూడా జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కోసమే వేచి చూడాలనేది మా సినిమాలో చెబుతున్నాం’ అని డైరెక్టర్ మంగా శ్రీనివాస్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్