"ప్రేక్షకులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మీకు గొప్ప అనుభూతిని అందించాలని నిజాయితీతో కొత్త జోనర్లో సినిమా చేశాము. త్రివిక్రమ్, చినబాబు చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి ఇంతటి స్పందన రావడం ఆనందంగా ఉంది. చాలా మంది ఫోన్ చేసి సినిమా బాగుందని ప్రశంసించారు. కుటుంబ ప్రేక్షకు లకు ఎప్పుడూ మంచి సినిమా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను. వారికి సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అని కథానాయకుడు వెంకటేష్ అన్నారు.
వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు.
భారీ అంచనాల నడుమ ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని.. షో షోకి వసూళ్ళను పెంచుకుంటూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘మొదటి షో నుంచే మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇది ప్రేక్షకులు మాట్లాడాల్సిన సమయం. ప్రేక్షకులు మాట్లాడాలి.. మేం వినాలి. మీ స్పందనకు, మీ ప్రేమకు ధన్యవాదాలు. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ ఆనందం మరింత కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. సత్య మాట్లాడుతూ, ‘త్రివిక్రమ్ సినిమాలో ఇంత మంచి పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ప్రేక్షకుల స్పందన బాగుంది
2 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)