Saturday, May 31, 2025
E-PAPER
Homeఆటలుమూడోరౌండ్‌కు సిన్నర్‌, జ్వెరేవ్‌

మూడోరౌండ్‌కు సిన్నర్‌, జ్వెరేవ్‌

- Advertisement -

– డి-మినార్‌, రుబ్లేవ్‌, మెన్సిక్‌ ఔట్‌..
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
పారిస్‌:
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సంచనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌, 3వ సీడ్‌ జ్వెరేవ్‌ మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లగా.. 9వ సీడ్‌ డి-మినార్‌(ఆస్ట్రేలియా), 19వ సీడ్‌ మెన్సిక్‌(చెక్‌), 26వ సీడ్‌ డావిడోరిచ్‌(స్పెయిన్‌) రెండోరౌండ్‌ దాటలేకపోయారు. సిన్నర్‌ 6-3, 6-0, 6-4తో ఫ్రాన్స్‌కు చెందిన గ్యాస్కెట్‌ను చిత్తుచేయగా.. జ్వెరేవ్‌ 3-6తో తొలిసెట్‌ కోల్పోయినా.. ఆ తర్వాత 6-1, 6-2, 6-3తో డి-జంగ్‌(నెదర్లాండ్స్‌)పై మిగిలిన మూడు సెట్లను చేజిక్కించుకొని మూడోరౌండ్‌కు చేరాడు. ఇక డి-మినార్‌(ఆస్ట్రేలియా) 6-2, 6-2, 4-6, 3-6, 2-6తో బబ్లిక్‌(కజకిస్తాన్‌) చేతిలో, మెన్సిక్‌ 6-2, 6-1, 4-6, 3-6, 3-6తో రోఛా(పోర్చుగల్‌) చేతిలో పోరాడి ఓడారు. ఇక 26వ సీడ్‌ డావిడోవిచ్‌(స్పెయిన్‌) 2-6, 6-3, 1-6, 2-6తో అన్‌సీడెడ్‌ లెహెక్కా(చెక్‌) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఇక 14వ సీడ్‌ ఫీల్స్‌(ఫ్రాన్స్‌) 7-6(7-3), 7-6(7-4), 2-6, 0-6, 6-4తో మునార్‌(స్పెయిన్‌)పై చెమటోడ్చి నెగ్గి మూడోరౌండ్‌కు చేరాడు.
గాఫ్‌, పెగూలా జోరు… :
మహిళల సింగిల్స్‌లో అమెరికా సంచలనాలు, 2వ సీడ్‌ కోకా గాఫ్‌, 3వ సీడ్‌ పెగూలా ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచారు. గాఫ్‌ 6-2, 6-4తో వాలెంటోవా(చెక్‌)పై, పెగూలా 6-3, 7-6(7-3)తో ఎ.లీ సహచర క్రీడాకారిణిపై గెలిచి మూడోరౌండ్‌కు చేరారు. మరో పోటీలో 15వ సీడ్‌ క్రేజికోవా 0-6, 3-6తో కుడ్మెంటోవా(రష్యా) చేతిలో ఓటమిపాలవ్వగా.. 6వ సీడ్‌ ఆండ్రీవా(రష్యా) 6-3, 6-4తో కుంజెర్‌(అమెరికా)ను చిత్తుచేసి ముందుకు దూసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -