ప్రతిపక్షాల ఆందోళన నడుమ గోవా బిల్లు ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై చర్చించాలనే డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పర్వంతో ముగిసింది. మంగళవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డు పట్టుకుని నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఎటువంటి చర్చ లేకుండా గోవాలో ఎస్‌టీ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించిన బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఇటు రాజ్యసభలోనే ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ తొలిత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడగా, తిరిగి ప్రారంభమైన సభలోనూ ఆందోళన కొనసాగడంతో ఏకంగా బుధవారానికి వాయిదా పడింది. ఎటువంటి చర్చ లేకుండానే ప్రతిపక్షాల ఆందోళన మధ్య మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడించే తీర్మానాన్ని ఆమోదించారు.
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
పార్లమెంట్ ఆవరణలో బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబి తా సవరణ (ఎస్‌ఐఆర్)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. మం గళవారం పార్లమెంట్ మకరద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేట్టా రు. ప్లకార్డులు పట్టుకుని మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరే కంగా నినాదాల హౌరెత్తించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాధీ, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ణు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందే
- Advertisement -
- Advertisement -