Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంకేర‌ళ శ‌బ‌రిమ‌ల గోల్డ్ చోరీ కేసును చేధించిన సిట్

కేర‌ళ శ‌బ‌రిమ‌ల గోల్డ్ చోరీ కేసును చేధించిన సిట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేర‌ళ శ‌బ‌రిమ‌ల గోల్డ్ చోరీ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(SIT) చేధించింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ చీప్ ఏ. పద్మాక‌ర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. 2019 సంవ‌త్స‌రంలో ట్రావెన్ కోర్ బోర్డుకు ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించార‌ని, ఆ స‌మ‌యంలోనే గోల్డ్ చోరీ అయిందని అధికారులు మీడియాకు తెలిపారు. ద‌ర్యాప్తులో భాగంగా అనేక‌సార్లు ఇవాళ ఉద‌యం నుంచి ప‌ద్మాక‌ర్‌ను విచారించామ‌ని, ఈక్ర‌మంలోనే గోల్డ్ చోరి కేసును చేధించామ‌న్నారు.

నవంబర్ 17న, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బంగారు దొంగతనం కేసుపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా శబరిమల సన్నిధానంలో శాస్త్రీయ పరీక్షను ప్రారంభించింది. గర్భగుడి లోపల ఉన్న ద్వారపాలక శిల్పం, బంగారంతో కప్పబడిన చెక్క తలుపు నిర్మాణం నుండి అధికారులు ప‌లు నమూనాలను సేకరిస్తున్నారు. ఈనెల 7న గోల్డ్ చోరీ కేసుతో సంబంధమున్న తిరువాభరణం ఆలయ కమిషనర్ కెఎస్ బైజు అధికారులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌క‌ముందు అక్టోబ‌ర్ 7న ఉన్నికృష్ణ‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ కోర్టు ఆదేశాల‌తో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన సిట్..ఎట్ట‌కేల‌కు నిందితుల‌ను గుర్తించింది.

1998లో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా 30.3 కిలోగ్రాముల బంగారం, 1,900 కిలోగ్రాముల రాగిని విరాళంగా అంద‌జేశారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం గర్భగుడి చెక్క శిల్పాలను కప్పడానికి ఈ బంగారాన్ని త‌ప‌డంగా వినియోగించారు. ప‌లు కార‌ణాల‌తో శుద్ధి చేయ‌డానికి ప‌లు ప్రాంతాల‌కు తర‌లించారు. ఈక్ర‌మంలోనే భారీ మొత్తంలో బంగారం తూకంలో మార్పులు సంభ‌వించాయి. ఆల‌య క‌మిటీ ఫిర్యాదు ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -