నవతెలంగాణ-హైదరాబాద్: నల్గొండ జిల్లా కోర్రేముల గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సీతాఫల్‌మండి ఎన్‌ఎస్‌ఎస్ (NSS) యూనిట్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలోని శ్రమదానం నిర్వహించి స్థానిక పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి వెంకటేశం మాట్లాడుతూ.. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. యువత పరిశుభ్రత, ఆరోగ్యంపై బాధ్యతగా ముందడుగు వేయాలన్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. వెంకటేశం ఉపాధ్యాయులు, డా. శిర్గమళ్ళ కిషోర్, బి.శ్రావ్య, కేర్ టేకర్ రామకృష్ణ గ్రామ అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్స్, వాలంటీర్స్ సౌజన్య, పూజ, మహాలక్ష్మి, అరుణ, దివ్య, అరుణ్ కుమార్, సాయి, రాజ్ కుమార్, దీపక్, శ్రావణి, నందిని, భువనేశ్వరి, స్నేహ, సంధ్య, నవీన్ పాల్గొన్నారు.

