నవతెలంగాణ-హైదరాబాద్: పాలస్తీనాపై ఇజ్రాయిల్ మారణకాండను యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అదే బాటలో ఫ్రాన్స్ తో పాటు మరో ఆరో దేశాలు పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. తాజాగా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అండోరా, బెల్జియం, లక్సెంబర్గ్, మాల్టాచ, మొనాకో, సౌదీ అరేబియా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 80వ వార్షిక సర్వ ప్రతినిధుల సభ సమావేశానికి 150కుపైగా దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి యూఎస్ సభ్య దేశాల్లో 193కు దాదాపు 147 దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. దీంతో అంతర్జాతీయంగా 80శాతానికి పైగా పాలస్తీనాకు ఆయా దేశాలు అండగా నిలిచాయి.
రెండు దేశాల ప్రతిపాదన చాలా ఏండ్లు నుంచి వాయిదా పడిందని, ఈ సమావేశంతో ఆ సమస్యకు ముగింపు పలకనున్నామని, ఇంతటితో ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణకు శుభంకార్డు పడనుందని ఫ్రాన్స్ ప్రధాని మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.