- Advertisement -
హిమాచల్‌ప్రదేశ్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు లోయలో పడటంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా కొండిపాంతం నుంచి పడిన ఓ రాయి కారును ఢకొీట్టింది. దీంతో అదుపుతప్పిన కారు భారీ లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాజేష్, హన్సో (36) దంపతులు, వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్ (15), బావమరిది హిమరాజ్, మరో వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -