నవతెలంగాణ-హైదరాబాద్ : బుధవారం తెల్లవారుజామున కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. SUV, ఒక ప్రయివేటు బస్సు పరస్పరం ఢీకొనడంతో మొత్తం ఆగురురు ప్రాణాలు కోల్పోయారు. బసవన బాగేవాడి తాలూకాలోని మనగులి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. విజయ్‌పుర పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబర్గి ప్రకారం, సోలాపూర్ వైపు వెళుతున్న మహీంద్రా SUV300 వాహనం ముంబై నుంచి బళ్లారికి వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు గుర్తించారు.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు, బస్సులోని ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మంగళూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES