నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్సెట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలంటే స్కిల్స్ కలిగి ఉండాలని, శిక్షణ పొందిన తర్వాత సాధన చేయడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అవుతుందన్నారు. ప్రతి ఒక్క అమ్మాయి తమ కాళ్ళపై నిలబడి ఎంపవర్మెంట్ సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సిడిపిఓ రోతిష్మ, సూపర్వైజర్ మంగ, ఆర్ సెట్ టీం, గ్రామ కార్యదర్శి మహేష్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు రాజు, శిక్షణ పొందే మహిళలు, తదితరులు ఉన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES