Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలురాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు స్లేట్ విద్యార్థి

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు స్లేట్ విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ జన్నారం

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని విద్యా భారతి హైస్కూల్ లో జోనల్ స్థాయి చెస్ టోర్నీ నిర్వహించారు. ఇందులో స్లేట్ పాఠశాల విద్యార్థి డి.సాహిత్ అండర్ 14 బాలుర విభాగంలో ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

చదువుతో పాటు క్రీడలలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారుల మధ్య పోటీ పడుతూ అత్యుత్తమ వ్యూహాత్మక ఆటను ప్రదర్శించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన విద్యార్థినీ స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ డైరెక్టర్ ఏనుగు రజిత రెడ్డి, ప్రిన్సిపల్స్ శిరిన్,శ్రీదేవి వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష్, నాగేష్, జోష్నా, కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -