Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంహాస్టల్‌ విద్యార్థులకు స్మార్ట్‌కార్డులు

హాస్టల్‌ విద్యార్థులకు స్మార్ట్‌కార్డులు

- Advertisement -

– కాస్మోటిక్‌ చార్జీలు వారి ఖాతాల్లోకే : హాస్టళ్ల నిర్వహణపై సమీక్షలో సీఎస్‌ కే రామకృష్ణారావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందే విద్యార్థులకు డెబిట్‌ కార్డు తరహాలో స్మార్ట్‌ కార్డుల్ని ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. దానితో పాటే కాస్మోటిక్‌ చార్జీలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు అవసరమైన ప్రతిపాద నలు సిద్ధం చేయాలని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మంగళవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సాంఘీక, గిరిజన, మైనార్టీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వారికి కావల్సిన సబ్సులు, కాస్మోటిక్‌ వస్తువుల కొనుగోళ్లకు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్‌ విక్రయకేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి హాస్టళ్లకు సరిపడా సరుకులు, విద్యార్ధుల టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌, యూనిఫాంలు, బెడ్‌షీట్లు, కార్పెట్లు, స్కూల్‌బ్యాగ్‌లు సహా అవసరమైన సామాగ్రి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. వస్తువులు, సరుకుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ ముఖ్యకార్యదర్శి ఎన్‌ శ్రీధర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్‌ ఏ వర్షిణి, సెర్ప్‌ సీఇఓ దివ్య, బీసీ వెల్ఫేర్‌ సెక్రటరీ ఇ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -