- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ యువకుడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో సదరు యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మోటరోలా G-సిరీస్ ఫోన్‌ను ఓ యువకుడు తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే, అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ప్యాంట్‌కు మంటలు అంటుకుని చిన్నపాటి రంధ్రం పడింది. అదృష్టవశాత్తూ ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో ఫోన్ వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నది. బ్యాటరీ సమస్యే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
- Advertisement -



