Tuesday, November 25, 2025
E-PAPER
Homeఆటలుస్మృతి-ప‌లాశ్ పెండ్లి వాయిదా

స్మృతి-ప‌లాశ్ పెండ్లి వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన వివాహం చివరి నిమిషంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో అనూహ్యంగా వాయిదా పడింది. ఈ పరిణామాల వేళ పలాశ్‌ సోదరి, సింగర్‌ పలాక్‌ ముచ్చల్‌ ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ షేర్‌ చేశారు. ‘స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా స్మృతి-పలాశ్‌ వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇలాంటి సమయంలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్‌ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -