- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాను భారీ మంచు తుపాను వణికిస్తోంది. క్రిస్మస్ పండుగ ప్రయాణాల సమయంలో వాతావరణం తీవ్రంగా మారడంతో విమానయాన రంగంపై దాని ప్రభావం పడింది. దేశంలోని మిడ్‌వెస్ట్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ హిమపాతం హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 1,191కి పైగా విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయానికి 1,191 విమానాలు రద్దు కాగా, మరో 3,974 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌లో రాత్రికి రాత్రే 10 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -



