సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్
నవతెలంగాణ (వేల్పూర్) ఆర్మూర్
డివిజన్ పరిధిలో వీడీసీల నియంత్రత పాలన డ్రగ్స్ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నావని, గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకొని సామాజిక, సాంఘిక బహిష్కరణలు చట్ట విరుద్ధమని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. మండలంలోని రామన్నపేట గ్రామంలో సోమవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఏ సమస్య ఉన్న తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ఇస్తే చాలని బాధితులకు ఎలాంటి ఫీజు లేకుండా లాయర్ ను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ ప్రాంతంలో యువత డ్రగ్స్ వినియోగిస్తున్నారని పాన్ షాపుల్లో చాక్లెట్లు ,సిగరెట్ ఇలా అనేక రకాలుగా తయారుచేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారని, అన్ని దుకాణాలలో నిఘా వేయాలని, డ్రగ్స్ నిర్మూలనకు గ్రామాలలోని ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని, తమ తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసి ఉంచాలన్నారు. స్థానిక నాయకులు ,పోలీసులపై ఒత్తిడి తెచ్చి డ్రగ్స్ కు అలవాటుపడ్డ యువతను తప్పిస్తున్నారని, తప్పు చేసిన వారిని రక్షించడం కూడా తప్పేనని ,వాళ్లు కూడా శిక్షార్హులేనని అన్నారు. నేటి కంప్యూటర్ కాలంలో సైతం మూఢనమ్మకాలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లాయర్లు నారాయణ, రాజేశ్వర్, ఎస్సై రాము, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బట్టు శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రెటరీ రమేష్, కరోబార్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సాంఘిక బహిష్కరణలు చట్ట విరుద్ధం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES