నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆద్వర్యములో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమములను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. బుధవారం భువనగిరి పట్టణములోని ప్రభుత్వ బి.సి. కళాశాల బాలికల వసతి గృహ యందు నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్య అతిదిగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ యం కృష్ణ రెడ్డి హాజరయి విద్యార్దినిలతో యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. విద్యార్ధుల చేత సామాజిక న్యాయం గురించి విపులముగా వివరించడమే కాకుండా భవిష్యత్ గురించి అభివృద్ది గురించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి మాట్లాడటం జరిగినది. తదుపరి విద్యార్దినీల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో స్థానిక తహశిల్దార్ యన్ అంజి రెడ్డి, యస్.సి ఈ డి కార్పోరేషన్ జె.శ్యాంసుందర్, సహాయ బిసి అభివృద్ధి అధికారి బి.సుబ్బా రెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, విజయశాంతి, సునిల్ కుమార్ రెవిన్యూ సిబ్బంది వసతి గృహ విద్యార్దినీలు నాల్గవ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.
ఘనంగా సామాజిక న్యాయ దినోత్సవము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



