Saturday, April 11, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్సామాజిక సంస్కర్త మహాత్మజ్యోతిరావు ఫూలే

సామాజిక సంస్కర్త మహాత్మజ్యోతిరావు ఫూలే

- Advertisement -
  • సర్పంచ్ మంజులశ్రీనివాసులు

నవతెలంగాణ-ఊరుకొండ: కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్తైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీరావ్ గోవిందరావు ఫులే అని.. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఊరుకొండ సర్పంచ్ మ్యాజల మంజులశ్రీనివాసులు అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంలో మండలంలోని ఆయా గ్రామాల్లో మహాత్మా జ్యోతీరావ్ గోవిందరావు ఫులే 199వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఊరుకొండ మండల కేంద్రంలో నవభారతి అసోసియేషన్ ఊరుకొండ వారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి గ్రామ మరియు మండల యువకులు మండల పెద్దలు ఊరుకొండ గ్రామ సర్పంచ్ మ్యాకల మంజులశ్రీనివాసులు, నవ భారతీ అసోసియేషన్ అధ్యక్షులు మ్యాకల శ్రీనివాసులు, మండల బిజెపి అధ్యక్షులు రాజేందర్ గౌడ్ తో పాటు వివిధ గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సందీప్ కుమార్, కిరణ్ కుమార్ నాయక్, కొమ్ము శ్రీను, హరీష్, గోపాల్, జంగయ్య, శ్రీశైలం, మహేష్, రమేష్ నాయక్, తిరుపతి, ఆనంద్, మరియు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -