నవతెలంగాణ-హైదరాబాద్ : కుంగుబాటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 32 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కోకాపేట మైహోం తర్ష్కయ 1వ టవర్‌లో ఢిల్లీకి చెందిన అమన్‌జైన్(32), తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. కొంత కాలంగా కుంగుబాటుకు చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం అమన్‌జైన్ ఒకటో టవర్ 32వ అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
విషాదం..భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES