Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుసింహాచలం ఘటన..సాఫ్ట్‌వేర్‌ దంపతులు మృతి

సింహాచలం ఘటన..సాఫ్ట్‌వేర్‌ దంపతులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : సింహాచలం ఘటనలో మృతిచెందిన వారిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)గా నిర్ధరించారు. వీరు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ.. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు దర్శన నిమిత్తం రూ.300 క్యూలైన్‌లో వేచిఉండగా గోడకూలిన ఘటనలో ఉమామహేశ్వరరావు, శైలజ మృతిచెందారు. ఉమామహేశ్‌ హెచ్‌సీఎల్‌లో, శైలజ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులిద్దరూ చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img