Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుSolidarity: సానుభూతి కంటే సంఘీభావం ముఖ్యం - ప్రొఫెసర్. జి. హరగోపాల్

Solidarity: సానుభూతి కంటే సంఘీభావం ముఖ్యం – ప్రొఫెసర్. జి. హరగోపాల్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: యుద్ధ సంక్షోభ కాలంలో సానుభూతి కంటే సంఘీభావం అత్యంత ముఖ్యమని, మానవ హననం జరగని, హక్కులు కాలరాయబడని సమాజాన్ని కాంక్షించాలని, అందుకు మనమంతా సంఘటితమై పోరాడాలని మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్. జి. హరగోపాల్ అన్నారు. దొంతం చరణ్ రాసిన ‘సాక్ష్యం’ కవితా సంపుటిని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఈ సభకి మహేష్ వేల్పుల అధ్యక్షత వహిస్తూ ఒక సున్నితమైన మనిషి బలమైన కవిత్వం రాశాడని, పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండకు బలవుతున్న పసి పిల్లల, తల్లుల ఘోషను తన గుండెకు హత్తుకున్నాడని అన్నారు.

ప్రముఖ కవి, విశ్లేషకులు పుప్పాల శ్రీరామ్, రచయిత్రి తీగల లావణ్య, ప్రియాంక, అరుణ వక్తలుగా చరణ్ కవిత్వం పై ప్రసంగిస్తూ బలమైన మానవవీయతతో, భరోసా కల్పించేలా కవిత్వం ఈ పుస్తకం ఉందని తెలిపారు. వివిధ యూనివర్సిటీ నుండి వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ చరణ్ కవిత్వం సామాజిక స్పృహ కలదని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి విమర్శకుడు ఎ. కె ప్రభాకర్, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్ , పర్యావరణ కార్యకర్తలు అన్సార్, టీన, వైష్ణవి, పేర్ల రాము, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -