Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించండి

ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించండి

– ఉప ముఖ్యమంత్రి భట్టికి ఎమ్మెల్సీ కొమరయ్య వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు ఎంతోకాలంగా మెడికల్‌, సరెండర్‌ పెండింగ్‌ బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గతేడాది సిపిక్స్‌ సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు రెమ్యూనరేషన్‌ను ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img