Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబుల్ లేన్ రోడ్డు సమస్యను పరిష్కరించండి

డబుల్ లేన్ రోడ్డు సమస్యను పరిష్కరించండి

- Advertisement -

మంత్రికి విన్నవించిన ముత్యాల సునీల్ కుమార్ 
నవతెలంగాణ – బాల్కొండ 

మండల పరిధిలోని వన్నెల్ బి ఆర్ అండ్ బి రోడ్డు నుంచి బోదేపల్లికి వెళ్లే రోడ్డు సమస్యను పరిష్కరించాలని పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి సీతక్క వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నియోజకవర్గ సమస్యలను మంత్రికి తెలిపారు. ఇందులో బోదేపల్లి గ్రామ రోడ్డు సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2023 లో  ప్రారంభించి సింగిల్ లెన్ రోడ్డుకు ఇరువైపులా తవ్వి కంకర పోసి వదిలేయడం జరిగిందని,దీంతో  అనేకమంది వాహనదారులకు ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బోదేపల్లి గ్రామ ప్రజల  సమస్యను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -