Monday, April 6, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

- Advertisement -
  • మహాధర్నకు తరలిన ఉద్యోగస్తులు

నవతెలంగాణ-మిడ్జిల్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వరంగల్లులో చేపడుతున్న మహాధర్నకు భారీగా తరలి రావాలని ఐఎన్టియుసి జడ్చర్ల డివిజన్ కార్యదర్శి మద్ది నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ లో నిర్వహిస్తున్న మహాధర్నకు బయల్దేరారు. ఈ సందర్భంగా మద్ది నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పనిచేస్తున్న సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబి రూల్స్ వర్తింప చేయాలి, విద్యా అర్హతలు బట్టి కన్వర్షన్ చేయాలి డిమాండ్ చేశారు. టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్‌లలో అన్ మ్యాన్ కార్మికులను ఆర్టిసన్‌గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులని GO నెంబ‌ర్ 11 ప్రకారం కనీసవేతనాలు చెల్లించాలని, కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి 45 రోజులు దాటినా, పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు తెలిపిన యాజమాన్యంగాని, ప్రభుత్వం గాని చర్చలకి పిలవకుండా కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వము సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల ఎనిమిదో తేదీ నుండి విధులను బహిష్కరించి సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగస్తులు, మధు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -