నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమేశ్వర ఆలయం స్థానికుల కె పూర్తిహక్కు ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆలేరు మండలం కొలనుపాక లో గల సోమేశ్వర ఆలయం విషయంలో గత కొద్ది కాలంగా గ్రామస్తులకు మరియు కర్ణాటక కు చెందిన రంభ పూరి జగద్గురువులు సోమేశ్వర ఆలయం తమదంటే,తమదని జరుగుతున్న వివాదంలో సోమవారం నాడు ప్రభుత్వ విప్ ఎంపీ కలగజేసుకొని గ్రామస్తుల తో కర్ణాటక చెందిన జగద్గురువుల ప్రతినిధులను కూర్చోబెట్టి గుడి విషయంలో ఉన్న వివాదాన్ని విన్నారు.ఆలయ ధర్మకర్త గంగుల శ్రీనివాస్ మాజీ ఎం పీ పీ అశోక్ మాజీ సర్పంచ్ మోత్కూర్ ఐలయ్య సోమేశ్వర ఆలయాన్ని గతంలో గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక కు చెందిన వివిధ కులాల మఠాల వారు జగద్గురు పేరుతోఅక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం పట్ల గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.వేల సంవత్సరాల క్రితం గుడి నిర్మాణ స్థలం కొలనుపాకకు చెందిందని కాలక్రమంగా కర్ణాటక జగద్గురులు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు గుడి మొత్తం తమదే అని చెబుతున్నారని వివరించారు. గుడి ప్రక్కనే కర్ణాటక వారిచే నిర్మించబడ్డ యాత్ర నివాస్ ట్రస్ట్ వరకు వాళ్లు పరిమితమై ఉండాలని ఎంపీ ఎమ్మెల్యేలకు గ్రామ పెద్దలు వివరించారు.సోమేశ్వర ఆలయాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహిస్తామని తెలియజేశారు.
జనవరి 17వ తేదీన కర్ణాటక కు చెందిన రంభపురి జగద్గురుల 35వ పీఠా ఆరోహణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కర్ణాటక ప్రతినిధులతో ఎంపీ ఎమ్మెల్యే సమక్షంలో చెప్పారు. ఆ కార్యక్రమం సజావుగా జరగాలంటే గ్రామపంచాయతీకి లేదా ఎంపీకి గాని ఎమ్మెల్యే కి గాని లిఖితపూర్వకంగా కర్ణాటక కు చెందిన జగద్గురువులు దేవాలయం కొలనుపాక గ్రామస్తులది అని రాసి ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలని అప్పుడే గ్రామంలో దేవాలయంలోకి జగద్గురువులకు పూజలు జరుపుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న ప్రభుత్వ విప్,ఎంపి కొలనుపాక గ్రామంలో ఉన్న దేవస్థానం గ్రామస్తులకు చెందినది అని గ్రామస్తులతో వివాదం వద్దని కోరిన విధంగా నడుచుకొని 35వ పిఠారోహణ కార్యక్రమం చేసుకోవాలని చెప్పారు.కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకోవాలని కోరారు. జరిగిన చర్చల్లో గ్రామ సర్పంచ్ యాకమ్మ వెంకటేష్,ఉప సర్పంచ్ విజేందర్ రెడ్డి సిపిఐ ఎంఎల్ నాయకులు బాల మల్లేష్, బిజెపి నాయకులు శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కొండరాజు వెంకట్రాజు గ్రామ శాఖ అధ్యక్షులు విజేందర్ రెడ్డి ఆరె ప్రశాంత్ భీమగొని సంతోష్ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.



