నవతెలంగాణ నవాబుపేట: మండల కేంద్రానికి చెందిన ఎరుకలి బుచ్చయ్య అనే వ్యక్తిని ఆయన కొడుకు ఎరుకలి యాదయ్య సోమవారం సాయంత్రం తల్లి ఎరుకలి మాసమ్మ కళ్ళముందే గోడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. కొంతకాలం క్రితం యాదయ్య మహబూబ్ నగర్ పట్టణంలోని పాల్ కొండకు యువతిని ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని బుచ్చయ్య కోడలిని అసహ్యించుకోవడం తోపాటు ఆమెపై బుచ్చయ్య చేయి చేసుకున్నాడు. అది చూసి భరించలేని యాదయ్య క్షణికావేశానికి గురై పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రి తలపై మెడపై విచక్షణారహితంగా నరికాడు. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ విక్రం పోలీసులను అక్కడకు పంపి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES