- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. కానీ మెదక్ జిల్లా వెల్దుర్తిలో అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్(32)కు 2022లో పూజతో వివాహమైంది. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని అత్తమామలు వేధిస్తున్నారు. ఈనెల 2న పెద్దల పంచాయితీలోనూ దూషించారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఈనెల 18న పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామలపై కేసు నమోదైంది.
- Advertisement -


