నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో మేఘాలయ హనీమూన్ హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ సోనమ్‌తో వివాహం జరగ్గా.. 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కన్పించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత తమదైన శైలిలో విచారణ చేపట్టగా భర్తను మాష్టార్ ప్లాన్‌తో సోనమ్‌మే హత్య చేసిందని రుజువైంది.
అయితే తాజాగా నిందితురాలు సోనమ్ రఘువంశీ ప్రస్తుతం షిల్లాంగ్ జైలులో ఉంది. పాయి. అయితే, ఆమెను నిరంతరం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించాయి. ఇక, ఆమెకు ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కుటుంబసభ్యులెవరూ నిందితురాలిని చూడటానికి రాలేదని, కనీసం ఫోన్‌లో కూడా ఆమెతో మాట్లాడలేదని జైలు వర్గాల సమాచారం.