నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా అలీ ఖమేనీ హత్యపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మౌనం వహించడం తటస్థంగా లేదని, బదులుగా ఇది పరాజయమని అన్నారు. భారత విదేశాంగ విధాన లక్ష్యము, విశ్వసనీయతపై సందేహం లేవనెత్తుతోందని అన్నారు. బడ్జెట్ సమావేశాల రెండవ భాగం కోసం పార్లమెంట్ తిరిగి సమావేశమైనపుడు, అంతర్జాతీయ వ్యవస్థ విచ్చిన్నంపై ప్రభుత్వ ‘ఇబ్బందికరమైన నిశ్శబ్దం’ గురించి బహిరంగంగా మరియు ఎగవేయకుండా చర్చించాలని అన్నారు.
జాతీయ మీడియాలో ప్రచురితమైన తన వ్యాసంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. నైతిక బలాన్ని మనం తిరిగి కనుగొని దానిని స్పష్టత మరియు నిబద్ధతతో వ్యక్తీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసపినట్లు అమెరికా మరియు ఇజ్రాయిల్ ధృవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల సమయంలో దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర చీలికను సూచిస్తుందని అన్నారు. అయితే, ఈ ఘటన షాక్‌కు మించి, భారత ప్రభుత్వ మౌనం కూడా అంతే దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. భారత ప్రభుత్వం హత్యను లేదా ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించడం మానుకుందని ఆమె పేర్కొన్నారు.



