శ్వాసల ఆవిరి గదిలో కాలపు గడియారం
ఇరుసు లేని చక్రమై తిరుగుతోంది.
క్షణాలన్నీ హిమబిందువులై
తాకినంతనే ఆవిరైపోయే ఒక అస్పష్ట చిత్రపటం...
ఒకానొక శూన్యతలో
కాంతి అంచులపై వేలాడే అదృశ్య రేఖ.
గాలి ఊపిరిపోసుకునే వేళ
శబ్దం తన రూపాన్ని కోల్పోయి,
శ్లేషలుగా, నిశ్శబ్ద తరంగాలుగా పరుచుకుంటుంది.
గతం – రాలిపడిన ఒక అక్షర ఛాయ.
వర్తమానం – కరిగిపోతున్న ఒక నీటి బొట్టు స్పర్శ.
భవిష్యత్తు – కాన్వాస్ పై ఇంకా పడని ఒక అమూర్త వర్ణం.
రూపం లేని ఆకారం వెతుక్కుంటూ...
స్పందనలన్నీ ఏకమై,
గగన శూన్యంలో ఒక మహా నిశ్శబ్దమై కరిగిపోతున్నాయి.
ఇక్కడ ప్రతి ఊపిరి –
ఒక అదృశ్య కావ్యానికి ముగింపు చరణం,
మరొక అపరిమిత ప్రయాణానికి మౌన ఆరంభం!!
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834






కామెంట్‌లు (0)