Magazines

దీపావళి పండుగ ..!!

38 నిమిషాల క్రితం

The Festival of Diwali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

ఎప్పుడు ఎప్పుడు వస్తుందీ

ఎన్నెన్ని రోజులకొస్తుందీ

ఇంకా ఎన్నాళ్ళకొస్తుందీ

దీపావళెప్పుడు వస్తుందీ


అమాసనాడు వస్తుందీ

దీపాల పండుగ వస్తుందీ

ఊరంత వెలుగు తెస్తుందీ
ఆనందహేళీ తెస్తుందీ

అమ్మానాన్నను అడగండి

కొత్త బట్టలు కొనండి

అక్కా అన్నా పదండీ

దీపాల వరుస పెట్టండి

మతాబులన్నీ చుట్టేద్దాం

మందు గుండూ నింపేద్దాం

టపాకాయలు కాల్చేద్దాం

తారాజువ్వలు వేసేద్దాం


తాతాబామ్మను పిలిచేద్దాం

పేనీపాయసం చేసేద్దాం

ఇరుగుపొరుగుకు పంచేద్దాం

పండుగ బాగా చేసేద్దాం
- డా.హారిక చెరుకుపల్లి, 9000559913

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్