కాలంతో పోటీ పడిన పరీక్షల్లో
మూడవ కాలు నాకు ఊతమైంది.
నేడు వయోభారంతో గడప ముంగిట్లో నేను,
నా మూడవ కాలు ఇంటికి కాపలాగా మారింది.
నా కట్టె కాలే రోజున
తానూ నాతో కాలుతానంది!
అప్పుడే తెలిసింది...
నాకు రెండే కాళ్లని అనుకున్నాను,
మూడవది కర్ర కాదు, నా నీడ అని.
నా గెలుపులో వెంట నడిచిన నేస్తమని,
నా ఓటమిలో నన్ను మోసిన బంధమని,
నా బతుకు పొడుగునా నా చేయి విడవని
నా ఏకైక తోడని!
ఇప్పుడు దేహం అలసినా, మనసు చెబుతోంది -
ఈ కర్ర విరిగినా నేను నిలబడతాను,
ఎందుకంటే నా ఊపిరిలో ఇంకా
నా మూడవ కాలు నడక మిగిలే ఉంది.
రాము కోలా, 9849001201







కామెంట్‌లు (0)