Magazines

బాల గేయాలు

1 గంట క్రితం

Bathukamma
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

బతుకమ్మ


మా ఇంటికొచ్చేను గౌరమ్మ

పండుగ తెచ్చేను బతుకమ్మ

రంగురంగుల పూల బతుకమ్మ

అందాల మాయమ్మ గౌరమ్మ

తంగేడు పూవుల్ల గౌరమ్మ

బంగారు ఛాయల్ల బతుకమ్మ

మెత్తని గునుగుల బతుకమ్మ

మగువల చేతుల్ల గౌరమ్మ

బంతి చామంతుల గౌరమ్మ

బాలల నవ్వుల్ల బతుకమ్మ

గుమ్మడి పువ్వుల్ల బతుకమ్మ

గాజుల చేతుల్ల గౌరమ్మ

చిన్నా పెద్దా చేరి గౌరమ్మ

పువ్వుపువ్వు పేర్చి బతుకమ్మ

ఆటపాటల్లోన బతుకమ్మ

అందరొక్కటయ్యేరు గౌరమ్మ

భక్తిగ కొలిచిరి గౌరమ్మ

దీవెనలిచ్చెను బతుకమ్మ

భామల నెత్తిన బతుకమ్మ

గంగమ్మను చేరె గౌరమ్మ

డా.హారిక చెరుకుపల్లి

9000559913

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్