Magazines

బంగారు పతకంతో మెరిసిన సాహిత్ పటేల్..!!!

2 రోజుల క్రితం

హాయ్‌ ‌పిల్లలూ.. మీకు సాహిత్‌ ‌పటేల్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం


హాయ్‌ ‌పిల్లలూ.. మీకు సాహిత్‌ ‌పటేల్‌ ఎవరో తెలుసా? ఈ మధ్యనే బాక్సింగ్‌‌లో బంగారు పతకం సాధించాడు. వీళ్లది మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రం. వాళ్ల నాన్న CISF జవాన్‌గా పని చేస్తున్నారు. ఆయన పేరు పాదం మహేందర్‌. ఇక మన సాహిత్ SGFI U14 గ్రూప్‌లో 36-38 వెయిట్ క్యాటగిరిలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకి ప్రాతినిద్యం వహించాడు. అక్టోబర్‌ 12-13న హైదరాబాద్‌లో జరిగిన రాస్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. బలమైన ప్రత్యర్థులను తన పదునైన పంచ్‌లతో ఓడించాడు. ఆ పోటీల్లో బంగారు పతకం సాధించి జిల్లా పేరును medal Tally లో ముందుకు తీసుకుపోయాడు. సింగరేణి ప్రాంతానికి, తన జిల్లాకే వన్నె తెచ్చాడు. అంతేకాదు సాహిత్ నవంబర్‌ 23 నుండి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహిస్తాడు. అతనికి స్వయాన తండ్రే కోచ్‌గా ఉండటం వల్ల ఎక్కువ సమయం శిక్షణకి అవకాశం దొరికింది. అలాగే సీనియర్ బాక్సింగ్ కోచ్ మైసూర్ సార్‌ ‌వద్ద మెలకువలు నేర్చుకొని రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం గెలుచుకున్నాడు. అంతేకాదు SGF సెక్రెటరీ యాకుబ్ సార్‌, బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు జి.శ్రీనివాస్ సార్‌ ‌సాహిత్‌‌ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వీరందరి సహకారంతో జాతీయ స్థాయి బాక్సింగ్‌లో పతకం గెలిచి జిల్లాకి మంచి పేరు తేవడమే తన లక్ష్యం అని సాహిత్ అంటున్నాడు. సాహిత్‌ని DEO IAS చంద్రయ్య గారు, మంచిర్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, సెక్రెటరీ రాజ్ కుమార్, సీనియర్ క్రీడాకారులు జయ కృష్ణ, శ్రీకాంత్, అసోసియేషన్ సభ్యులు జగన్ రాజు నాయక్, వేముల కిరణ్, NIS కోచ్ సందీప్ జగత్ సాయి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రేమ్‌‌కుమార్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్