కథకులు శ్రీ కేశిరాజు వెంకట వరదయ్య (K.M. వరదయ్య గారు) కథకుడుగా చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం అనుకుంటాను. వీరు చాలా తక్కువ కథలు రాస్తారు, అయితేనేం సుప్రసిద్ధులైన తనికెళ్ళ భరణి విరించి (తల్లాప్రగడ గోపాలకృష్ణయ్య) శిరంశెట్టి కాంతారావు లాంటి సాహితీ ప్రముఖులకు చిరపరిచితులు.
వారి ఆదరణ చూరగొన్నవారు వరదయ్య. ‘నా కథలన్నీ నా జీవితానుభవాల సారమే’ అని సగర్వంగా చెప్పుకునే వెంకట వరదయ్య కథల్లో కథా శైలిలో పాఠకులకు తమకు తాము కనబడుతారు. వాస్తవిక నేపథ్యం వల్ల పాఠకులకు ఒకరకమైన దగ్గరితనం కనిపిస్తుంది. Intimacy అనుభూతిస్తారు పాఠకులు. విస్తృతమైన పరిశీలన, పరిశోధన కనిపిస్తుంది. కథను సమాజంలోంచే ఏరుకున్నా, రచయత తనదైన ప్రత్యేకతను, అభివ్యక్తిని ప్రదర్శిస్తారు. లోగడే కథలు రాసేవారట. ఉద్యోగించు సమయాన, సమయం అనుకూలించకనో, మరే కారణం వల్లనో ఆపేసారు. కస్టమ్స్ & సెంట్రల్ ఎక్సయిజ్ & జీ.ఎస్. టిలో ఉద్యోగానంతరం మళ్లీ మొదలెట్టానని చెప్పుకున్న వీరికి ఆపారమైన వ్యక్తిగత, ఉద్యోగానుభవాల్లోంచి ఏరుకున్న కథలు అని అనవచ్చు, ఉద్యోగిగా లోతైన పరిశీలన టైటిల్ కథ ‘చిలకలగూడ రైల్వే బ్రిడ్జ్’లో కనిపిస్తుంది. ఈ కథలో ఒక ప్రయివేట్ డిటెక్టివ్గా రంగా, అతని స్నేహితుడు శ్రీహర్ష ఓపిగ్గా కేసు శోధించి, దొరికిన బ్యాగును, అందులోని 9 లక్షల క్యాష్, కొత్త సెల్ఫోన్ను తిరిగి ఓనరుకి అప్పగించటం కథాంశం. పాఠకుడిని రంగా వెంట పమనింపచేసి చివరకు ‘ముడి’ విప్పి ముగిస్తారు రచయిత.
మచ్చుకు మరోకథ. భగవంతుడు ఎప్పుడూ, ఎవరికీ అన్ని తలుపులు మూయడు, ఎక్కడో ఓ చోట,కనీసం ఓ కిటికయైనా తెరిచి ఉంచుతాడు వెలుగు ప్రసరించేందుకు. జితేంద్ర, సుష్మలు భార్యాభర్తలు. కొడుకు శశాంకకు రెండేళ్లు నిండినా సరిగా మాటలు రావు. Mental Retardation అను వంశికంగా రావొచ్చు? జితేంద్ర తమ్ముడిదీ అదే కేసు. బాబాయి రాజారావు జితేంద్రను కుటుంబానికి దూరంగా ఉంచుతాడు. పిచ్చివాడి అన్న అంటే ఆత్మన్యూనత అని.
సంగతి తెలుసుకున్న సుష్మ అతన్ని విడిచిపోతుంది. చాలాకాలం తరువాశ జితేంద్ర బాబాయ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆమెతో పాటు తమ్ముడు విజయేంద్ర శాశాంక్ సంరక్షణా భారాన్ని వహిస్తూ కనిపిస్తాడు. బంగారం లాంటి సుష్మ మనసును అర్థం చేసుకుంటాడు జితేంద్ర. కథలో చెప్పని సంగతులు, చెప్పిన సంగతుల వెనుక ఉన్నా నిగూఢత ఆకట్టుకుంటుంది.
.చేసిన అప్పులు ఈ జన్మలో కాకుంటే మరో జన్మలోనైనా తీర్చవలసి ఉంటుంది. అందుకని ఈ జన్మలోనే భర్త చేసిన అప్పులన్నీ తీర్చాలనుకుంటుంది భార్య జానకమ్మ. వడియాలు, అప్పడాలు చేసి భర్త ఆఫీసులో అమ్మి, బాకీలన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీర్చుకుంటుంది, తీర్చిన మరుక్షణం తనువు చాలిస్తుంది జానకమ్మ. గొప్ప సెంటిమెంట్, మంచి నీతిగల కథ ఇది. చదువుతోన్నంత సేపు పాఠకులకు జానకమ్మ మీద సానుభూతి కొండలా పెరుగుతుంది. మిగతా కథలన్నీ ఇలాంటి సెంటిమెంట్, మంచితనం ప్రోత్సహిస్తాయి. రచయితకు అభినందనలు.
కూర చిదంబరం : 8639338675







కామెంట్లు (0)