- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మరోసారి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఎన్నికయ్యారు. సీఏబీ 94వ వార్షిక జనరల్ సమావేశాల్లో సౌరవ్ గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆరేళ్ల తర్వాత మళ్లీ గంగూలీ బెంగాల్ క్రికెట్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో బెంగాల్ టైగర్ సౌరవ్ 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా చేశారు. సోదరుడు స్నేహాశిశ్ గంగూలీ స్థానంలో సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
- Advertisement -